Tenth Public Exams : టెన్త్ పబ్లిక్ పరీక్షలకు భయపడి.. లక్ష మంది విద్యార్థులు బడికి దూరంగా.. ఎక్కడంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : పబ్లిక్ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రాకుండా నిలిచిపోయారు.
ప్రసుత్త విద్యా సంవత్సరంలో లక్షమందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేసినట్లు వెల్లడైంది. తమిళనాడు వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకివచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను పబ్లిక పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని, ఆ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తేల్చింది.
చదవండి: ఒక్కో పాఠశాలకు 46 లక్షలు.. దేశవ్యాప్తంగా 9 వేల పాఠశాలలకు మహర్దశ
Published date : 30 Mar 2023 03:55PM