విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించేలా బోధన
Sakshi Education
పాన్‌గల్: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించేలా బోధన సాగాలని జిల్లా సెక్టోరియల్ అధికారి యుగంధర్ అన్నారు.
నవంబర్ 14న మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలల్లో అమలవుతున్న ఉన్నతి, లక్ష్య, ముఖ గుర్తింపు హాజరు అమలు తీరుపై ఆరా తీశారు.
చదవండి: ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
అనంతరం పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నెహ్రూకు బాలలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఉత్సవం జరుపుకొంటామన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Published date : 15 Nov 2023 04:14PM