పరిశోధనలు మరింత పెరగాలి: గవర్నర్
ఆగస్టు 25న వరంగల్‌లో నిర్వ హించిన Kakatiya University 22వ స్నాతకో త్సవంలో గవర్నర్ ప్రసంగించారు. ఉన్నతస్థితికి చేరాలంటే కష్టపడాలని, జీవితమంటే పూలబాట కాదని, సవాళ్లను ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. చెట్లు శాఖల ను విస్తరించుకుంటూ వెళ్లినట్లు విద్యార్థులు కూడా మూ లాలను పటిష్టపర్చుకోవాలన్నారు. ఉన్నత విద్యారంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉండాలని, ఇక్కడ సామర్థ్యా లు పుష్కలంగా ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. తల్లి దండ్రులు ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తున్నారని, విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని అన్నారు.
చదవండి: పాఠశాల మ్యాగజైన్ తో సృజనాత్మక శక్తి వృద్ధి
విద్యార్థినులు చాలెంజింగ్ కోర్సులను ఎంచుకోవాలి
కేయూలో మహిళలకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రశంసించారు. విద్యార్థినులు చాలెంజింగ్ కోర్సుల్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు మెడిసిన్‌లో విద్యార్థినులు కేవలం గైన కాలజీని మాత్రమే ఎక్కువగా ఎంపిక చేసుకునేవారని, ఇప్పుడు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి ప్రత్యేక సబ్జెక్టులను కూడా ఎంచుకోవడం అభినందనీ యమన్నారు. సాహితీవేత్త అంపశయ్య నవీన్ గొప్పరచయిత అని ప్రశంసించారు. రాణి రుద్రమదేవి ధీరత్వాన్ని తమిళిసై గుర్తు చేశారు. ఒక మహిళగా గవర్నర్ పాత్రను తాను సవాల్‌గా తీసుకుని నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: Tamilisai Soundararajan: మానసిక దృఢత్వం, ధైర్యంతో ఉంటేనే పరీక్షల్లో విజయం
విద్యతో ఆలోచనలు విస్తృతం: సెర్బ్ సెక్రటరీ
విద్య మన ఆలోచనల్ని, పరిధుల్ని విస్తృతం చేస్తుందని న్యూఢిల్లీలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (సెర్బ్) సెక్రటరీ ప్రొఫెసర్ సందీప్‌వర్మ అన్నారు. జీవనోపాధికి సంబంధించిన సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు, ముందుచూపు ఉన్న నాయకుడిగా మారేందుకు నిరంతర అభ్యసనం అవసరం అన్నారు. స్నాతకోత్సవంలో కేయూ వీసీ తాటికొండ రమేశ్, రిజి స్ట్రార్ వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ పీహెచ్‌డీ అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు.