Skip to main content

Tamilisai Soundararajan: మానసిక దృఢత్వం, ధైర్యంతో ఉంటేనే పరీక్షల్లో విజయం

విద్యార్థులు మానసిక దృఢత్వం, ధైర్యంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
Success in exams is possible only if you are mentally strong and courageous
‘ఎగ్జామ్‌ వారియర్స్‌’తెలుగు అనువాదం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న గవర్నర్‌ తమిళిసై

దీనికోసం మానసిక ప్రశాంతత, విశ్రాంతి అవసరమని సూచించారు. రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో జరిగిన ప్రధానమంత్రి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌ ‘పరీక్షా పే చర్చా’5వ ఎడిషన్‌లో ఆమె వివిధ పాఠశాలల విద్యార్థులతో కలసి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆమె విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ’పరీక్షా పే చర్చా’కార్యక్రమం త్వరలో జరిగే బోర్డు, ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ప్రశాంతంగా హాజరయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కూడిన సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మమేకమవ్వడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ఆనందంగా ఉందని గవర్నర్‌ తెలిపారు. విద్యార్థులు ప్రధాని సలహాలను పాటించాలని, భయాందోళనలకు దూరంగా ఉండి, పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, రంగారెడ్డి జిల్లా నల్లగండ్ల జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రధానమంత్రి ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’తెలుగు అనువాదాన్ని విద్యార్థులకు అందించారు. 

Sakshi Education Mobile App
Published date : 02 Apr 2022 04:47PM

Photo Stories