Skip to main content

AP Govt Schools: 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ట్యాబ్‌లు పంపిణీ

Education Department Distributing Tablets for Second Year,Tab are distributed to all 8th class students,Byjus Provides Tablets to Eighth Graders

పార్వతీపురం టౌన్‌: సర్కారు బడుల్లో చుదుకునే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దు తోంది. ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా బైలింగ్విన్‌ పద్ధతిలో పుస్తకాలను ముద్రించింది. మరో వైపు బైజూస్‌ కంటెంట్‌తో ఇన్‌స్టాల్‌ చేసిన ట్యాబ్‌లను ఎనిమిదో తరగతి విద్యార్థులకు, వారికి బోధించే ఉపాధ్యాయులకు అందజేస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా ట్యాబ్‌ల పంపిణీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది పార్వతీపురం మన్యం జిల్లాలోని విద్యార్థులు, టీచర్లకు కలిపి మొ త్తం 11,852 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. దీనికోసం రూ.35.23 కోట్లు ఖర్చు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు రూ.34 కోట్ల ఖర్చుతో 9,898 మందికి ట్యాబ్‌ల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. బైజూస్‌ ట్యాబ్‌ల కొనసాగింపుగా పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ ప్యానెల్‌, స్మార్ట్‌ టీవీల్లో కూడా బైజూస్‌ కంటెంట్‌ చూపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ట్యాబ్‌ను కూడా మూడేళ్ల వారంటీతో కొనుగో లు చేయనుంది. విద్యార్థులు ట్యాబ్‌లు ఉపయోగించే క్రమంలో అనుకోని పక్షంలో జరిగే స్క్రీన్‌ డ్యామేజీకి కూడా ప్రభుత్వమే రిపేరీ చేయించాలని నిర్ణయించింది.

డిజిటల్‌ అసిస్టెంట్లు ప్రతినెలా పాఠశాలల సందర్శన
విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ బాధ్యతలను డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం అప్పగించింది. డిజిటల్‌ అసిస్టెంట్లు ప్రతినెలా కనీసం ఒక్కసారి ప్రతి పాఠశాలనూ సందర్శించి ట్యాబ్‌లు పనితీరును చెక్‌ చేస్తారు. ట్యాబ్‌ రిపేరీ బాధ్యతలు కూడా వారే చూస్తారు. వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ ప్రతివారం పాఠశాలను సందర్శిస్తారు. ప్రతి శుక్రవారం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి ట్యాబ్‌లకు వైఫై కనెక్ట్‌ చేసి వినియోగ వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేస్తారు.

ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకునేలా..
ట్యాబ్‌లను దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం ‘టెక్టోరో’ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ భాగస్వామ్యంతో ట్యాబ్‌లో యూట్యూబ్‌, కెమెరా, ఇతర యాప్‌లు ఓపెన్‌ కాకుండా చర్యలు చేపట్టింది. మూడు యాప్‌ల(వైఫై, బైజూ స్‌, డిక్షనరీ)ను అందుబాటులో ఉంచింది. అప్‌డేట్‌ చేయడానికి ఎంఆర్‌సీ సిబ్బంది, సీ ఆర్పీలకు, పాఠశాల హెచ్‌ఎంలు, యాక్టివ్‌ టీచర్లు, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి పాఠశాల స్థాయి లోనే అప్డేట్‌ చేయిస్తున్నారు. అప్డేట్‌ చేసే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

మరమ్మతులకు స్పెషల్‌ డ్రైవ్‌
బైజూస్‌ కంటెంట్‌ కలిగిన ట్యాబ్‌లు మరమ్మతులకు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఈనెల ఒకటి నుంచి జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. స్క్రీన్‌ రిపేరీ ఉంటే దాదాపు రూ.6వేలకు పైగా ఖర్చు వస్తుంది. ఈ మొత్తం కూడా ప్రభుత్వమే భరించనుంది. వినియోగంపై తరచూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కె.దేవిశ్రీ, బైజూస్‌ ట్యాబ్‌ల నోడల్‌ అధికారి

పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తున్నాం
విద్యార్థులకు పూర్తిస్థాయి లో ట్యాబ్‌ల పంపిణీకి చర్య లు చేపట్టాం.ఈ ఏడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ట్యాబ్‌లు పంపి ణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు పంపిణీ పూర్తి చేస్తాం. ట్యాబ్‌లపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.
– రామకృష్ణ, బైజూస్‌ ట్యాబ్‌ల నోడల్‌ అధికారి

చదువుకు సాయం
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిసెంబర్‌లోగా ట్యాబ్‌లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా విద్యార్థులకు ఉపయోగపడేలా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేస్తోంది. గతేడాది పంపిణీ చేసిన ట్యాబ్‌లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. విద్యార్థులకు చాలా ఉపయోగపడుతున్నాయి.
– ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం

Published date : 22 Sep 2023 11:23AM

Photo Stories