Skip to main content

SVU: స్నాతకోత్సవం తేదీలు ప్రకటన

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జూన్ 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మహమ్మద్‌ హుస్సేన్ లు మే 16న ఒక ప్రకటనలో తెలిపారు.
SVU
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం స్నాతకోత్సవం తేదీలు ప్రకటన

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఎస్వీయూ 58, 59, 60, 61, 62వ సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకలను శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. ఇందులో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ‘‘ఇన్ పర్సన్’’ విభాగం ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ రోజు డిగ్రీలను నేరుగా పొందవచ్చన్నారు. ‘‘ఇన్ ఆబ్సెన్షియా’’ విభాగం ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటే వారి డిగ్రీలను స్నాతకోత్సవం తరువాత సంబంధిత కళాశాలలకు పంపుతామన్నారు. ప్రైవేటు, దూరవిద్య ద్వారా పాసైన పీహెచ్‌డీ, ఎంఫిల్, పీజీ విద్యార్థులకు వారు దరఖాస్తులో సూచించిన చిరునామాకు తపాలా ద్వారా డిగ్రీలను పంపనున్నట్లు పేర్కొన్నారు. 

Sakshi Education Mobile App
Published date : 17 May 2022 12:48PM

Photo Stories