పాఠశాలలకు సెలవులు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రల్ 23న చివరి పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.
24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి. 1 నుంచి 9వ తరగతులకు ఇప్పటికే ఎస్‌ఏ–2 పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 23న ఫలితాలను కూడా ప్రకటిస్తారు. అయితే, టెన్త్ పరీక్షలు మే 23 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులకు రోజుకు ఒక సబ్జెక్టుకు ప్రత్యేక క్లాస్ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో ప్రతీ రోజు ఒక టీచర్ హాజరవ్వాల్సి ఉంటుంది.
Published date : 23 Apr 2022 05:01PM