విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
Sakshi Education
భైంసా: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగా లని ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ అన్నా రు. సెప్టెంబర్ 15న వర్సిటీలో కాకతీయ శాండ్‌బా క్స్, దేశ్‌పాండే ఫౌండేషన్, గ్రాడ్ క్యాపిటల్ వ్య వస్థాపకులతో వ్యవస్థాపక అవగాహన కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రధానంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌పై ‘యువ’ ప్రోగ్రామ్ ఆ ఫీసర్ రాజురెడ్డి, కాకతీయ శాండ్‌బాక్స్ సీఈవో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కోసం ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ’లో మూడు నెలల నాన్ క్రెడిట్ కోర్సు ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు.
ప్రతీ సమస్యకు పరిష్కారం ఉన్నట్లుగానే ప్రతీ పనికి ఒక నూతన ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులు సాంకేతికంగా ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్నోవేషన్ ఎట్ ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో రాకేశ్‌రెడ్డి కోఆర్డినేటర్, విద్యార్థులు తదితరు లు పాల్గొన్నారు.
చదవండి:
RGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..
Published date : 16 Sep 2023 02:56PM