AISF: విద్యారంగ సమస్యలపై పోరాటం
![AISF](/sites/default/files/images/2023/08/04/03knt253-180090mr-1691136755.jpg)
రెండ్రోజుల పాటు జరగనున్న ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆగస్టు 3న జిల్లాకేంద్రంలోని తారకహోటల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందించలేదని పేర్కొన్నారు.
చదవండి: New Exam Pattern: విద్యా ప్రమాణాలు పెరుగుతాయి
ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో తేవడాన్ని వ్యతిరేకించాలని, దీనిపై విద్యార్థి సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘ ం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటిక్యాల రామకృష్ణ, రెహమాన్, రఘురాం, గ్యార నరేశ్, గ్యార క్రాంతి, రాజు, బాలసాని లెనిన్, సోతుకు ప్రవీణ్, నెల్లి సత్య, మచ్చ రమేశ్, మడ్డుపల్లి లక్ష్మణ్, జనార్ధన్, సంతోష్ పాల్గొన్నారు.