Solar Lights: సర్కారు బడులకు సౌర వెలుగులు
ప్రాథమిక పాఠశాలల్లో రెండు కిలోవాట్ల ఎలక్ట్రికల్ ప్యానళ్లను ఏర్పాటు చేయనుండగా, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 5 కిలోవాట్లు, కేజీబీవీలలో 10 కిలో వా ట్లు గల గ్రిడ్ ప్యానళ్లను పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి వనరుల సంస్థ ద్వారా ఈ ప్రక్రియ చేపడుతుంది.
ఐదేళ్ల పాటు ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్కారు బడుల కు మేలు జరగనుంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది. కాగా గతేడాది జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలల్లో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు.
చదవండి: Survey: బడిబయటి పిల్లల గుర్తింపునకు సీఆర్పీల సర్వే
తడిసి మోపెడవుతున్న బిల్లులు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడువుతున్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు తమ జేబుల్లో నుంచి బిల్లులు చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోవడంతో కనెక్షన్లు కూడా తొలగించాల్సిన దుస్థి తి.
పాఠశాలల్లో ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లతో పాటు కంప్యూటర్లు, నీటి కోసం బోర్లను వినియోగిస్తున్నారు. వీటితో బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయి. అయితే స్కూల్ గ్రాంట్ అంతంత మాత్రంగానే విడుదలవుతోంది. అవికూడా సకాలంలో అందకపోవడంతో అప్పటివరకు ఈ బిల్లులు పేరుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Adolescent Education: కౌమార విద్యపై అవగాహన కల్పించండి
జిల్లాలో ఇలా..
జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 644 ఉన్నాయి. వీటిలో 65వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రభుత్వం జిల్లాలో 179 పాఠశాలల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మన ఊరు–మనబడి ద్వారా మౌ లిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న విష యం తెలిసిందే.
సోలార్ సిస్టమ్ కేటాయించిన పా ఠశాలల్లో 52 ప్రాథమిక, 28 ప్రాథమికోన్నత, 82 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే 17 కేజీ బీవీలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఒక్కో కి లోవాట్ ప్యానల్‌కు సంబంధించి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుండగా, ప్రాథమిక పాఠశాలలకు రూ.2లక్షల చొప్పున, ప్రాథమికోన్నత, ఉన్నత పా ఠశాలలకు రూ.5లక్షల చొప్పున, కేజీబీవీలకు రూ.10 లక్షల చొప్పున నిధులతో సమకూర్చుతోంది.
ఆదిలాబాద్‌రూరల్ మండలంలో 11, ఆదిలా బాద్‌అర్బన్‌లో 27, బజార్‌హత్నూర్‌లో 7, బేలలో 7, భీంపూర్‌లో 8, బోథ్‌లో 15, గాదిగూడలో 3, గుడిహత్నూర్‌లో 11, ఇచ్చోడలో 11, ఇంద్రవెల్లిలో 10, జైనథ్‌లో 18, మావలలో 2, నార్నూర్‌లో 6, నేరడిగొండలో 7, సిరికొండలో 3, తలమడుగులో 13, తాంసిలో 8, ఉట్నూర్ మండలంలో 12 పాఠశాలలకు సోలార్ ప్యానళ్లను కేటాయించనున్నారు.
179 పాఠశాలలు ఎంపిక
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లుల భారం తగ్గించడంతో పాటు పునరుత్పాదన ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 179 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇదివరకే స్కూళ్లకు ఇవి చేరుకోగా త్వరలోనే
అమర్చనున్నారు.
– జె.నారాయణ, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి