Skip to main content

Good News: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ

భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ(సీపెట్) ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Skill training for unemployed youth
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ

కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 ఏళ్లు నిండిన వారు అర్హులని సీపెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ తెలిపారు. భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ, ఎన్ ఎస్‌ఐసీ సంయుక్త సహకారంతో మెషీన్ ఆపరేటర్‌ – ఇంజక్షన్ మౌల్డింగ్‌ అనే అంశంపై ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు.. ప్రముఖ ప్లాస్టిక్స్‌ అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారు. విజయనగరం, విశాఖపట్నం, వైఎస్సార్‌ జిల్లాల అభ్యర్థులకు శిక్షణలో ప్రాధాన్యం ఇస్తారు. జనవరి 25న ప్రారంభం కానున్న శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలకు 6300147965, 7093538843ను సంప్రదించాలని సీహెచ్‌ శేఖర్‌ సూచించారు.

చదవండి: 

Schools: యధావిధిగా పాఠశాలలు

Education: కొత్త విద్యకు నాంది

Published date : 17 Jan 2022 01:36PM

Photo Stories