Skip to main content

Schools: యధావిధిగా పాఠశాలలు

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని, ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా పాఠశాలలు నడుస్తాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
Schools
యధావిధిగా పాఠశాలలు

విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులకూ దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఈ విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి సెలవుల విషయంపై ఆలోచిస్తామన్నారు.

విద్యకు అధిక ప్రాధాన్యం

విద్యకు పేదరికం అడ్డు కాకూడదన్న మహా సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా కాకుమాను నన్నపనేని నాగయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి సురేష్‌ పాల్గొన్నారు. పాఠశాలలో జూనియర్‌ కాలేజీ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి సురేష్‌ హామీ ఇచ్చారు. సుచరిత మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలోని పూర్వ విద్యార్థులు రూ.4 కోట్లను సేకరించి అభివృద్ధి పనులు చేయడంతో పాటు.. 16 అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. రూ.33 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను మంత్రులు ప్రారంభించారు. ముందుగా పాఠశాల స్థల, నిర్మాణ దాత నన్నపనేని నాగయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం తమ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, పాఠశాల పూర్వ విద్యార్థి జేడీ శీలం, కారుమంచి ప్రసాద్‌బాబు, నల్లమోతు రత్తయ్య, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ నల్లమోతు శివరామకృష్ణ, ఐఏఎస్‌ అధికారి వేముల ఎలీషా తదితరులు పాల్గొన్నారు. 

Published date : 17 Jan 2022 12:27PM

Photo Stories