Skip to main content

PG Medical Education: ఇన్‌ సర్వీస్ కోటా

పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
PG Medical Education
పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్ కోటా

ఈమేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా లోని మొత్తం సీట్లలో 20 శాతం క్లినికల్, 30 శాతం నాన్ క్లినికల్‌ విభాగాల్లోని పీజీ సీట్లను ఇన్‌ సరీ్వస్‌ కోటా కింద కేటాయించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన నియమితులైన ఎంబీబీఎస్‌ వైద్యులు ఉన్నత విద్య అభ్యసించాలనుకున్నప్పుడు వారికి ఇన్‌ సరీ్వస్‌ కోటాను వర్తింపజేస్తారన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్యులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కలి్పంచడం పట్ల తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్‌ విభాగం) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ రాథోడ్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. కాగా, తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ మాత్రం ఇన్ సర్వీస్‌ కోటాను వ్యతిరేకిస్తోంది. ఇన్‌ సర్వీస్‌ వైద్యులకు పీజీ ప్రవేశాల కోసం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసి గతంలో ఉన్న జీవో ఎంఎస్‌ నెంబర్‌ 27 మాదిరిగానే పునరుద్ధరించాల్సిందిగా సంబంధిత ప్రతినిధులు కోరారు. 

చదవండి: 

APSSDC: అమెరికా ఐటీ ఉద్యోగాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ శిక్షణ

10,865 Jobs : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి చర్యలు..జిల్లాల వారిగా..

Jobs: తెలంగాణలో బారీగా ఉద్యోగాలు

Published date : 20 Nov 2021 05:51PM

Photo Stories