Sakshi Media Group: రంగయ్యకు ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నవంబర్ 16న హైదరా బాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా విభా గంలో ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జ్ఞాపికతోపాటు ప్రశంసా పత్రం అందుకున్నారు. కాగా రంగయ్య ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూపర్–100 కార్యక్రమం అమలు, గ్రామాభివృద్ధి కోసం, మద్యపాన నిషేధం కోసం కృషి చేశారు. ఎఫ్‌ఎం సావర్‌ఖేడా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
ఆయన పిల్లలు సైతం అదే పాఠశాలలో ఏడో తరగతి వరకు చదవగా, ఆయన సతీమణి ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు.
చదవండి: Sakshi Media Group: ప్రతిభకు మెట్టు
గవర్నర్ అభినందన
‘విద్యార్థులే కాదు.. గ్రామాన్ని కూడా నాదే అనుకుని ప్రజలను దురలవాట్లను దూరం చేసి ప్రజలను సన్మార్గంలో నడిపించారు.
మద్యపాన నిషేధం కోసం నిరాహార దీక్ష చేశారు. చాలా మంది అభిమానాన్ని చూరగొన్నారు..’ అని రంగయ్యను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పాఠశాల, గ్రామాభివృద్ధికి మీ కుటుంబం చేసిన సేవలు మరువలేనివని వైస్ భారతీరెడ్డి కొనియాడారు.
విద్యావలంటీర్లు, ఉపాధ్యాయులతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని, అవార్డు రావడం మరింత బాధ్యత పెంచిందని రంగయ్య ‘సాక్షి’కి తెలిపారు.