Skip to main content

Mahendra Reddy: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

ప్రశాంతి నిలయం: విద్యార్థులు, యువతలో ఖాదీ వాడకంపై అవగాహన పెంపొందించేందుకు ‘‘ఖాదీ ఫర్‌ నేషన్‌ – ఖాదీ ఫర్‌ ఫ్యాషన్‌’’అన్న నినాదంతో ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ మహేంద్రరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Mahendra Reddy
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

అక్టోబర్‌ 31 వరకూ అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

మొదటి కేటగిరి కింద 6 నుంచి 10వ తరగతి, రెండో కేటగిరి కింద ఇంటర్‌ విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాదీ ప్రాముఖ్యతకు సంబంధించిన అంశాలపై పోటీలుంటాయన్నారు.

చదవండి:

Dream Successful: చిన్న‌ప్ప‌టి క‌ల‌ను సాకారం చేసుకున్న యువ‌కుడు

Peddireddy Venkataramana Reddy: ప్రతి విద్యార్థికీ చైల్డ్‌ ఐడీ తప్పనిసరి

Published date : 28 Oct 2023 03:29PM

Photo Stories