Peddireddy Venkataramana Reddy: ప్రతి విద్యార్థికీ చైల్డ్ ఐడీ తప్పనిసరి
అక్టోబర్ 18న డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) కసరత్తు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కసరత్తులో అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చదవండి: నాగజ్యోతికి విద్యాశాఖ కమిషనర్ అభినందన
జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(సీస్) నిర్వహించనున్నట్లు చెప్పా రు. ఈ సర్వే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించా లని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 774 ప్రభుత్వ, 339 ప్రైవేట్ మొత్తం 1,113 పాఠశాలల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 3,6,9 తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం సబ్జెక్టుల్లో అభ్యసన సామర్థ్యాల పరిశీలనకు పరీక్ష నిర్వహిస్తున్నారన్నా రు.
నవంబర్ 3వ తేదీన పరీక్ష నిర్వహణకు ఆయా మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా ఎంఈఓలు తప్పనిసరిగా నిబంధనల మేరకు తనిఖీలు తప్పనిసరిగా చేయాలన్నారు. తనిఖీలు చేసిన అనంతరం నివేదికలను తప్పని సరిగా జిల్లా కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గురుస్వామిరెడ్డి, సెక్టోరల్ ఆఫీసర్ అజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.