APSCHE: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
పీబీ సిద్ధార్థ కళాశాల ఆవరణలోని వెబ్‌నార్ హాల్లో విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలలకు ప్రత్యేక నైపుణ్యాభివృద్థి కార్యక్రమాలు అనే అంశంపై జూలై 20న వర్క్‌షాప్ నిర్వహించారు. రామ్మోహనరావు మాట్లాడుతూ అప్రెంటీస్ మిళితమైన డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల వృత్తి నైపుణ్యంతో పాటు స్టైఫండ్ కూడా పొందవచ్చని తెలిపారు. జాతీయ నైపుణ్యాభివృద్థి సంస్థ ప్రతినిధి మయాంక్ భట్నాగర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు కళాశాలల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు.
చదవండి: 4-Year Degree Courses: సరికొత్తగా రూపుదిద్దుకున్న డిగ్రీ కోర్సులు.. ఉద్యోగం గ్యారెంటీ..
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం డెప్యూటీ జనరల్ మేనేజర్ స్వాతి సింగ్ మాట్లాడుతూ యువత పరిశ్రమల స్థాపనకు ఈ పథకం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ ఆఫీసర్ మాథ్యూ శ్రీరంగం, ఉన్నత విద్యా మండలి అకడమిక్ కన్సల్టెంట్స్ డాక్టర్ సీవీఎస్ భాస్కర్, బి.ఎల్లారెడ్డి, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల డీన్ రాజేష్ సి.జంపాలతో పాటుగా యూనివర్శిటీలు, స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.