విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 27న ప్రారంభమైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, అంతరిక్ష విజ్ఞానం, కాలుష్య నియంత్రణ, కంప్యూటర్ పరిజ్ఞానం అంశాల్లో 260 ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ... విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చదవండి: ప్రైవేటు స్కూళ్లలో ఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులకు భరోసా కల్పిస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు హుందాగా ఉండేలా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా నాణ్యమైన యూనిఫాం, బూట్లు, పుస్తకాలతో కూడిన కిట్లను అందిస్తున్నామని వివరించారు.
చదవండి: ప్రాథమిక విద్య @ 20
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యారంగంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే ఎక్కువగా మన రాష్ట్రంలో సౌకర్యాలు కలి్పస్తామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 28న కూడా కొనసాగనుంది. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పాల్గొన్నారు.