ప్రాథమిక విద్య @ 20
64.19 పాయింట్లతో పంజాబ్ మొదటిస్థానంలో ఉండగా, 58.42 పాయింట్లతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలు వేరుగా ఉన్నాయి. ప్రాథమిక విద్య, సంఖ్యాశాస్త్రంపై విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలపై స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ తయారుచేసిన ‘ఫౌండేషన్ లెరి్నంగ్ స్టడీ’నివేదికలో ఈమేరకు పొందుపరిచారు. ఈ నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రోయ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ‘ది ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో విడుదల చేశారు.
చదవండి: EFLU: ఇందిరానగర్ పాఠశాలలో ఫారెన్ లాంగ్వేజెస్
లైబ్రరీ ఉన్న బడులు 90.58%
దేశంలోని 10వేల రాష్ట్ర ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 20 వేర్వేరు భాషల్లో 86 వేల మందికి పైగా మూడో తరగతి విద్యార్థుల అభ్యాసాన్ని ఈ అధ్యయనం విశ్లేషించింది. ఇందులో ఓవరాల్‌గా తెలంగాణ 34.38 పాయింట్లు సాధించగా, రాష్ట్రంలోని విద్యాసంస్థల మౌలిక వసతుల కల్పన విషయంలో 62.49 పాయింట్లు పొందింది. రాష్ట్రంలోని 92.22% పాఠశాలలకు విద్యుత్ సదుపాయం ఉండగా, 27.56% పాఠశాలల్లో పనిచేస్తున్న కంప్యూటర్లున్నాయి. 88.07% పాఠశాలల్లో మంచినీటి సదుపాయాలు, 33.62% పాఠశాలల్లో పనిచేస్తున్న టాయిలెట్లు ఉన్నాయి.
చదవండి: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సర్కారు వరం
19.49% పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, లైబ్రరీ ఉన్న బడులు 90.58% ఉన్నాయి. అంతేగాక 64.98% పాఠశాలల్లో మెడికల్ చెకప్స్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రైమరీ స్థాయిలో డ్రాప్‌ఔట్ రేటు 100% ఉండగా, ప్రీ స్కూల్ విద్య కేవలం 34.84% అందుతోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాథమి క విద్యపై 9%, మధ్యాహ్న భోజన పథకానికి 9% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని నివేదికలో వెల్లడించారు.
చదవండి: నూతన సాంకేతికతతో ఉద్యోగాలేమీ పోవు
కాగా, దేశంలో పాఠశాలల మూసివేత కారణంగా, దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో భారతదేశం 220కిపైగా భాషలను కోల్పోయిందని.. భాషలను సంరక్షించడం, సంరక్షణ చేయడంపై తగినంత శ్రద్ధ చూపట్లేదని వెల్లడించారు.
చదవండి: JVK: మేనమామ మేలిమి ‘కానుక’