ప్రమాణాల్లేని 24 డిగ్రీ కాలేజీల గుర్తింపు
వీటిలో కొన్నింటి గుర్తింపు అనుమతులను రద్దు చేయగా.. మరి కొన్ని కాలేజీల్లోని కోర్సులకు అనుమతులను ఉపసంహరించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్‌ప్రేమ్‌కుమార్ మే 13న ఓ ప్రకటన విడుదల చేశారు. గత మూడేళ్లుగా యూనివర్సిటీల అఫిలియేషన్ లేకుండా ప్రమాణాల మేర కు నిర్వహణలేని 24 ప్రైవేటు డిగ్రీ కాలేజీల అనుమతులను ఉపసంహరణ చేసినట్టు పేర్కొన్నారు. మూడేళ్లుగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు లేని 354 కాలేజీల్లో ఆయా కోర్సులకు ఉన్న అనుమతులనూ ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. ఉన్నత విద్యామండలి.. ఆయా కాలేజీల లోపాలపై వివరణ కోరుతూ ముందుగా నోటీసులి చి్చంది. అఫిలియేషన్ లేని 41 కాలేజీలకు నోటీసులివ్వగా వాటికి 17 కాలేజీలు వివరణ ఇచ్చాయి. స్పందించని 24 కాలేజీల అనుమతులను మండలి ఉపసంహరించింది. అలాగే వివిధ కోర్సుల్లో ప్రవేశాలు లేని 442 కోర్సులకు సంబంధించి ఆయా కాలేజీలకు నోటీసులి చి్చంది. వివరణ ఇవ్వని వివిధ కాలేజీల్లోని 354 కోర్సులను మండలి రద్దు చేసింది.