Skip to main content

బిట్స్‌ పిలానీ వీసీగా రాంగోపాల్‌రావు

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన వలిపె రాంగోపాల్‌రావు ప్రఖ్యాత బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ పిలానీ (బిట్స్‌ పిలానీ) విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.
Ram Gopal Rao
బిట్స్‌ పిలానీ వీసీగా రాంగోపాల్‌రావు

ఆయన నానో టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేసి దాని అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించారు. ఆయన తయారు చేసిన నానోస్నిఫర్‌ టెక్నాలజీని బ్రిటన్‌ దేశ రక్షణ వ్యవస్థలో వినియోగిస్తోంది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన అనంతరం ఆయన నానో టెక్నాలజీపైనే పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

చదవండి: బిట్స్‌లో ఘనంగా ‘అట్మాస్‌’

టాప్‌–5 ఐఐటీ యూనివర్సిటీలకు సమానంగా బిట్స్‌ పిలానీని తీర్చిదిద్దేందుకు తనవంతు కృషిచేస్తానని రాంగోపాల్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. 

చదవండి: BITS Pilani: ఆన్‌లైన్‌లో బిట్స్‌ పిలానీ బీఎస్సీ డిగ్రీ

Published date : 25 Feb 2023 01:00PM

Photo Stories