OU: వీసీపై గవర్నర్‌కు ప్రొఫెసర్ల ఫిర్యాదు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ తీసుకున్న నిర్ణయాలపై ఆ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) నాయకులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్‌కు ఫిర్యాదు చేశారు.
ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్ సంఘం నాయకులతో కలసి నవంబర్ 16న రాజ్‌భవన్‌లో గవర్నర్ వినతిపత్రం సమర్పించారు. ఓయూ వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అకడమిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వారు వివరించారు.
చదవండి: 800 మంది పూర్వ విద్యార్థుల పీహెచ్‌డీలు రద్దు?
యూజీసీ నిబంధనలకు , విద్యార్థులు, అధ్యాపకులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ అనేక ఇబ్బందులకు, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీసీ ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని, అకడమిక్ విషయాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని వినతిపత్రం సమర్పించినట్లు సీనియర్ ప్రొఫెసర్ కిషన్, ఔటా జాయింట్ సెక్రెటరీ డాక్టర్ గంగాధర్, డాక్టర్ సోమేశ్వర్ పేర్కొన్నారు.
చదవండి: OU: క్యాంపస్‌లో ఈ పరిశోధనాకేంద్రం: వైస్ చాన్స్‌లర్
Published date : 17 Nov 2022 01:43PM