Skip to main content

ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ రిజర్వేషన్‌కు పిల్‌

సాక్షి, అమరావతి: MBBS, BDS ప్రవేశాల్లో NCC విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్‌ వైఎస్సార్‌ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన Public Interest Litigation (PIL)పై హైకోర్టు స్పందించింది.
PIL for NCC reservation in MBBS admissions
ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ రిజర్వేషన్‌కు పిల్‌

ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్సార్‌ వైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్, ఎన్‌సీసీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం నవంబర్‌ 21న ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: High Court: ‘ఇంజనీరింగ్‌ నోటిఫికేషన్లు’.. తదుపరి చర్యలన్నీ నిలుపుదల

2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ సరి్టఫికెట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసయ్య నర్సింహ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

చదవండి: Department of Tribal Welfare: గిరిజన విద్యా సంస్థల్లో గేటు వరకే అనుమతి

పిటిషనర్‌ తరఫు న్యాయవాది కవిత గొట్టిపాటి వాదనలు వినిపిస్తూ.. ఎన్‌సీసీ కోటా విషయంలో అధికారులు ప్రభుత్వ జీవో ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత విద్యార్థులు వస్తే ఈ వ్యవహారంపై తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇది సర్వీసు వివాదమని, ఇలాంటి వ్యవహారంలో పిల్‌ దాఖలు చేయడం ఏమిటని ప్రశి్నంచింది. అయినా కూడా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది.

చదవండి: MLHP: నియామక ప్రక్రియపై స్టే

కవిత జోక్యం చేసుకుంటూ.. ప్రవేశాలు జరుగుతున్నాయని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. నోటీసులు జారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని పేర్కొంది.

చదవండి: కారణాలేంటో తెలియజేయండి.. ఈ మార్కుల తగ్గింపుపై ఎన్‌టీఏకు హైకోర్టు ఆదేశం

Published date : 22 Nov 2022 03:29PM

Photo Stories