టీఎస్ సీపీజీఈటీ–2021 కౌన్సెలింగ్ పక్రియ ముగిసిందని కన్వీనర్ పాండురంగారెడ్డి జనవరి 22న తెలిపారు.
బారీగా పీజీ కోర్సుల సీట్ల మిగులు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఓయూ 2021–22 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లోని పలు పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీచేశారు. చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా 6,498 మంది విద్యార్థులకు పీజీ సీట్లను కేటాయించగా మొత్తం కన్వీనర్ కోటాలో గల 52,927 సీట్లలో రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పరిధిలో 27 వేల పీజీ సీట్లు మిగిలినట్లు కనీ్వనర్ వెల్లడించారు. మిగిలిన సీట్లను ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునేలా త్వరలో ప్రకటన జారీ చేస్తామన్నారు. కాలేజీలు నిర్వహించే స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు కాదని తెలిపారు.