Telangana POPA: పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
Sakshi Education
సప్తగిరికాలనీ(కరీంనగర్): వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన పద్మశాలీ విద్యార్థులకు పద్మశాలీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు సంఘం ప్రతినిధులు పోలు సత్యనారాయణ, యెలిగేటి మల్లికార్జున్‌లు తెలిపారు.
ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన పద్మశాలీ విద్యార్థులు సెప్టెంబర్ 23లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏ రంగంలో ప్రతిభ చూపారో దానికి సంబంధించిన జిరాక్స్ ప్రతిని వినాయక మార్కెట్‌లోని బీపా భవన్, మంకమ్మతోటలోని విద్యార్థి బుక్ బ్యాంకులలో అందించాలని అన్నారు.
ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంసెట్, లాసెట్, నీట్, సెట్, బీటెక్, ఎంబీబీఎస్, పీజీ మెడికల్, సీఏ తదితర కోర్సుల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 98481 13295 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Published date : 07 Sep 2023 02:16PM