School Education Department: ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉత్తర్వులు
ఇటీవల గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా ఎంఈవో–2 పోస్టుల్లోకి పదోన్నతులు కల్పించడంతో ఏర్పడిన ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయనున్నారు. దీంతోపాటు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు సైతం స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో నియమించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ జూన్ 28న విడుదల చేసింది. భాషా పండితులు మినహా గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ లిస్టును 30న వెల్లడించాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ ఆదేశించారు.
చదవండి: Awards: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
హెచ్‌ఎంల ఎంపికపై జూలై 1, 2 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి 3న తుది సీనియారిటీ జాబితా వెల్లడించాలని, 4న కౌన్సెలింగ్ నిర్వహించి, కేటాయించిన ప్రాంతాల్లో ఐదోతేదీన రిపోర్టు చేయాలని ఆదేశించారు. స్కూల్ అసిస్టెంట్ల ఎంపికలో 1, 2, 3 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 4న తుది జాబితా వెల్లడి, 5న కౌన్సెలింగ్, 6న కొత్త పోస్టుల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు.
చదవండి: ANGRAU: ఎన్‌ఆర్‌ఐ కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు ఆహ్వానం