విదేశీ విద్యాసంస్థల సహకారంతో దేశంలోని ఎడ్యుటెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలకు గుర్తింపు లేదని University Grants Commission (UGC), All India Council for Technical Education (AICTE) అక్టోబర్ 28న ప్రకటించాయి.
ఆన్‌లైన్ పీహెచ్‌డీలకు గుర్తింపు లేదు
ఎడ్యు–టెక్ కంపెనీలు విదేశీ విద్యాసంస్థలతో చేసుకునే ఫ్రాంచైజీ ఒప్పందాలు నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టతనిచ్చాయి. ఆన్‌లైన్ పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన ప్రకటనలను చూసి మోసపోవద్దని విద్యార్థులను కోరాయి.రెండేళ్లుగా కరోనా కాలంలో ఆన్‌లైన్ విధానంలో విద్యనందించే ఎడ్యుటెక్ రంగానికి ప్రాధాన్యం పెరిగింది.