BSC Nursing: సెప్టెంబర్ 15 నుంచి ‘ఉచిత నర్సింగ్’ సర్టిఫికెట్ వెరిఫికేషన్
Sakshi Education
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ ఎం కోర్సులు పూర్తిచేసిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత ఐఈఎల్‌టీఎస్, ఓఈటీ శిక్షణ, ఉచిత నైపుణ్య శిక్షణకు సెప్టెంబర్ 15, 16, 17 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలంగాణ నర్సింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ కో ఆర్డినేటర్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు.
నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని సూచించారు. 4 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, జీఎన్ ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, కుల, ఆదాయ సరి్టఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని వివరించారు. బాటా షోరూం కాంప్లెక్స్, 4వ అంతస్తు, పనామా, వనస్థలిపురం, హైదరాబాద్ చిరునామాలో ఉదయం 10 గంటల నుంచి సరి్టఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 63091 64343, 98480 47327 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.
Published date : 14 Sep 2021 05:45PM