పీజీ వైద్య తొలి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఆక్టోబర్ 4వ తేదీ నుంచి 6వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
ఈ మేరకు వర్సిటీ మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను ఆక్టోబర్ 3న రాత్రి విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని కళాశాలలు, నిమ్స్‌కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయ నున్నారు. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆక్టోబర్ 4 ఉదయం 11 గంటల నుంచి 6 వ తేదీ ఉదయం 11 గంటల వరకు ప్రాధాన్యతాక్రమంలో కాలేజీల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.inలో చూడవచ్చు.
చదవండి:
Telangana : ఈ విద్యార్థులకు శుభవార్త.. 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే..
Published date : 04 Oct 2022 01:32PM