Nursing: కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్
. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ డిసెంబర్ 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్), రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ సై¯Œ్స ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ ఎంఎల్‌టీ) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కలి్పస్తామని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు నిరీ్ణత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయాలని సూచించింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తామని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని పేర్కొంది.
చదవండి:
Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం