Skip to main content

Admissions: యాజమాన్య సీట్లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌

2022–23 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్, నాన్‌మైనారిటీ, మైనారిటీ వైద్య, డెంటల్‌ కళాశాలల్లో యాజమాన్య సీట్లలో ప్రవేశాలకు NEET PG/NEET MDS–22లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ఆగస్టు 16న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Admissions
యాజమాన్య సీట్లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌

పీజీ మెడికల్‌ ప్రవేశాల కోసం https://pgmq.ntruhsadmissions.comలో, MDS ప్రవేశాల కోసం https://mdsmq.ntruhsadmissions.comలో ఆన్‌లైన్‌ అప్లికేషన్లు అందుబాటులో ఉంచింది. ఆగస్టు 17 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. సమాచారం కోసం 8978780501, 7997710168, 9391805238 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

చదవండి: 

Published date : 18 Aug 2022 01:46PM

Photo Stories