Admissions: ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
హెచ్‌సీయూలో 16 ఇంటిగ్రేటెడ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అన్ని ఇంటిగ్రేటెడ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో మొత్తం 315 సీట్లు ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో 128 సీట్లు, ఎస్సీలకు 47, ఎస్టీలకు 24, ఓబీసీలకు 85, ఈడబ్ల్యూఎస్‌లకు 31 సీట్లు రిజర్వు చేశారు. వీటికి అదనంగా 15 సీట్లు పీడబ్ల్యూడీ, రక్షణ సిబ్బందికి కేటాయించారు.
చదవండి: హెచ్‌సీయూ ప్రొఫెసర్లకు అరుదైన అవకాశం
కోర్సులలో ప్రవేశాలు సీయూఈటీ(యూజీ)2023 స్కోర్ ఆధారంగా ఉంటాయి. ఔత్సాహిక అభ్యర్థులు యూనివర్సిటీ అకడమిక్ వెబ్‌సైట్ లింక్ htt p://acad.uohyd.ac.in/లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో దరఖాస్తు రుసుము, ప్రాస్పెక్టస్, ప్రవేశ షెడ్యూల్, ఆన్‌లైన్ దరఖాస్తు తదితర అంశాలు అందుబాటులో ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు జూలై 30 చివరి తేదీ అని అధికారులు ప్రకటించారు.
చదవండి: HCU: ఎంబీఏ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరీ తేదీ ఇదే..