కేయూ క్యాంపస్: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ అబ్దుల్‌హై అక్టోబర్ 14న ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు
జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పరీక్ష ఫీజు, ఇతర వివరాలకు హెచ్‌టీటీపీ//బీఎస్‌ఈ.తెలంగాణ.గౌట్.ఇన్‌ను చూడాలని సూచించారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.