KNRUHS: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ముందుకురాని ఎన్‌సీసీ
కన్వీ నర్ కోటాలో ఎన్‌సీసీకి 1% సీట్లు కేటాయిస్తారు. ఆయా విద్యార్థుల సర్టిఫికెట్లను ఎన్‌సీసీ వెరిఫికేషన్ చేయా ల్సి ఉంటుంది. కాగా, వెరిఫికేషన్‌లో ఎన్‌సీసీ నిర్ల క్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆరోపిస్తోంది. తాము నోటిఫికేషన్ ఇచ్చి, గత అక్టోబర్ 19, 20వ తేదీల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని ఎన్‌సీసీ డైరెక్టరేట్‌కు లేఖ రాసినా పట్టించుకోవడం లేదని వర్సిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: MBBS: యథేచ్ఛగా సీట్ల బ్లాకింగ్!
ఈ జాప్యం వల్ల కన్వీనర్ కోటాలో ఎంబీబీ ఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరే ఎన్‌సీసీ సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎన్‌సీసీ సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జేఎన్‌టీ యూలో ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయాలని, అందుకు సిబ్బందిని డిప్యుటే షన్‌పై పంపాలని కాళోజీ వర్సిటీ దాదాపు నెల రోజుల కిందటే కోరింది. టీఏ, డీఏ, గౌరవ వేతనం కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది సజావుగా జరుగుతున్నా, ఎన్‌సీసీ ఈసారి తాత్సారం చేయడంతో విద్యా ర్థులకు నష్టం వాటిల్లుతుందని కాళోజీ వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: KNRUHS: పీజీ వైద్య విద్య తొలి విడత వెబ్ కౌన్సెలింగ్