Skip to main content

JNV: నవోదయ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

కొత్తగూడెంఅర్బన్‌: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 2024–25 సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి జ‌నవ‌రి 20న పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి జ‌నవ‌రి 12న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Navodaya Entrance Exam on 20th

పరీక్ష ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుందని, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. కొత్తగూడెం–3, భద్రాచలం–2, ఇల్లెందు–2, బూర్గంపాడు, అశ్వారావుపేటలలో ఒక్కోటి చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చదవండి: Collector Jitesh V Patil: నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా నుంచి 1,325 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు పొందాలని, గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. వివరాలకు ఏసీజీఈ ఎస్‌.మాధవరావును 99890 27943 నంబరులో సంప్రదించాలని కోరారు.

Published date : 13 Jan 2024 04:03PM

Photo Stories