Skip to main content

NSS: జాతీయ ఉత్తమ వలంటీర్‌గా ఎంపికెన విద్యార్థి

ఆంధ్ర విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం విద్యార్థి ధనియాల సాయి జాతీయ సేవా పథకం (ఎన్ఎస్‌ఎస్‌) జాతీయ ఉత్తమ వలంటీర్‌గా ఎంపికయ్యాడు.
NSS
జాతీయ ఉత్తమ వలంటీర్‌గా ఎంపికెన విద్యార్థి

2019–20 సంవత్సరానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవా ర్డుకు సాయి ఒక్కరే ఎంపిక అవ్వడం విశేషం. దేశవ్యాప్తంగా 30 మందికి అవార్డులు ప్రకటించగా.. సాయి ద్వితీయ స్థానంలో నిలి చాడు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాల–క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్‌ 24న జాతీయ సేవా పథకం (ఎన్ఎస్‌ఎస్‌) దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా సాయి ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా సాయిని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త ఆచార్య ఎస్‌.హరనాథ్, పీవో వి.ధనరాజు అభినందించారు.

చదవండి:

Community Science: కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలు..

Introduction to Aeronautical Engineering online course

Published date : 21 Sep 2021 01:16PM

Photo Stories