Skip to main content

Andhra Pradesh: జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు నక్కపల్లి విద్యార్థులు

నక్కపల్లి: ఇటీవల నిర్వహించిన సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో నక్కపల్లి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎంఈవో కుంచం నరేష్‌, హెచ్‌ఎం రాణిలలితలు న‌వంబ‌ర్ 30న‌ తెలిపారు.
Nakkapally students for national level science competitions  Nakkapalli ZP High School students win state science congress

అరటి దవ్వ పొడిని ఉపయోగించి భూసారాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సైన్స్‌ టీచర్‌ జి.సుమబిందు పర్యవేక్షణలో విద్యార్థులు జయవర్ధన్‌, జయదుర్గ, నానాజీలు ఈ ప్రాజెక్టును న‌వంబ‌ర్ 30న‌ విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించారు.

చదవండి: National Children's Science Congress 2023: పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించాలి

ప్రథమ స్థానంలో నిలిచి పతకం, సర్టిఫికెట్‌లు సాధించారు. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారు ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయికి ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఇందుకు కారణమైన విద్యార్థులను, టీచర్‌ను అభినందించారు.

నక్కపల్లి స్కూల్‌ నుంచి జాతీయ స్థాయికి ప్రాజెక్టు ఎంపిక కావడం పట్ల జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ నానాజీ, పేరెంట్స్‌ కమిటీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్‌, చైర్మన్‌ పద్మ తదితరులు అభినందనలు తెలిపారు.

Published date : 01 Dec 2023 12:26PM

Photo Stories