High Court: విద్యార్థుల తరలింపును అడ్డుకోలేం
తుది తీర్పునకు లోబడే చర్యలు ఉంటాయని పేర్కొంది. టీఆర్‌ఆర్, ఎంఎన్‌ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, వసతులు లేవంటూ 450 ఎంబీబీఎస్ సీట్లను, 100 పీజీ సీట్లను ఎంఎన్‌సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందులో మహావీర్, టీఆర్‌ఆర్ కాలేజీల్లోని 300 మంది విద్యార్థులను ఇతర ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ తరలింపుపై స్టే విధించాలని కోరుతూ టీఆర్‌ఆర్, మహావీర్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్, జస్టిస్ శరత్ ధర్మాసనం విచారణ జరిపింది. జనవరి నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయని, ఇప్పుడు ఇతర కాలేజీలకు మార్చడం సరికాదని టీఆర్‌ఆర్ కాలేజీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎన్‌ఎంసీ తరఫున గోరంట పూజిత వాదనలు వినిపిస్తూ.. అధ్యాపకులు, వసతులు లేని కారణంగానే కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించిందని చెప్పారు. కనీస వసతులు లేకుండా విద్యను అందించలేరన్నారు.
చదవండి: