Social Welfare Department: ఎస్సీ గురుకుల విద్యార్థులకు పతకాలు
వచ్చే జనవరి నుంచి ఈ పతకాలను విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నవంబర్ 25న ఓ ప్రకటన ద్వారా వివరించారు. 5 నుంచి 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులు సాధారణ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు వారాంతపు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పతకాలు అందిస్తారు.
చదవండి: JEE Advanced 2022: ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
ప్రతి తరగతిలో విద్యా విభాగంలో మూడు, క్రీడలు ఇతర విభాగాల్లో మూడు చొప్పున మొత్తం ఆరు పతకాలిస్తారు. వాటిలో రెండు స్వర్ణ, రెండు రజత, రెండు కాంస్య పతకాలుంటాయి. వారి క్లాస్ టీచర్ల ద్వారా వీటిని అందిస్తారు. అకడమిక్స్(విద్య)లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ స్టార్ పతకాలను, క్రీడలతో పాటు ఇతర అంశాల్లో అధిక మార్కులు సాధించిన వారికి ఆల్ రౌండర్ పతకాలను అందిస్తారు. ప్రతి గురుకులానికి 48 అకడమిక్, మరో 48 ఆల్ రౌండర్ పతకాలుంటాయి. రోలింగ్ విధానంలో ఇచ్చే ఈ పతకాలను ఏ వారానికి ఆ వారం ఎక్కువ మార్కులు సాధించిన వారికి బదిలీ చేస్తారు. దీనివల్ల తాము సాధించిన పతకాలను తమ వద్దే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.
చదవండి: Admissions: ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు