Skip to main content

MANUU: దూర విద్య ప్రవేశాల చివరి తేదీ ఇదే..

Maulana Azad National Urdu Universityలో దూర విద్యా విధానంలో పలు కోర్సులలో ప్రవేశాల కోసం గడువు అక్టోబర్‌ 20 తేదీగా నిర్ధారించినట్లు మనూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రజావుల్లాఖాన్‌ అక్టోబర్‌ 11న తెలిపారు.
MANUU
దూర విద్య ప్రవేశాల చివరి తేదీ ఇదే..

యూనివర్శిటీలో 2022–23 సెషన్‌ జూలై 2022లో డిస్టెన్స్‌ మోడ్‌ కోర్సులలో ఆన్‌లైన్‌ రిజిష్ట్రేష‌న్‌ కోసం చివరి తేదీ అక్టోబర్‌ 20గా, అడ్మిషన్‌ కోసం ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అక్టోబర్‌ 31గా నిర్ణయించామన్నారు.

చదవండి: MANUU: ‘మనూ’లో కొత్త కోర్సు

దూర విద్యా విధానంలో యూజీసీ ఆమోదించిన ఎంఏ ఉర్దూ, ఇంగ్లీష్, ఇస్లామిక్‌ స్టడీస్, అరబిక్, హిందీ, హిస్టరీ, బీఏ, బీకామ్, డిప్లోమో కోర్సులు, సరి్టఫికెట్‌ కోర్సులలో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వివరాలకు 040–23008463, 040–23120600 నెంబర్లలో సంప్రదించాలన్నారు. 

చదవండి: UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

Published date : 12 Oct 2022 02:32PM

Photo Stories