10th and Inter Exams: పరీక్షా సమయం!.. ఒత్తిడిని జయించే మార్గాలు ఇవే..!
Sakshi Education
పరీక్షలు.. ఈ పేరు వినగానే పిల్లల్లో ఆందోళన సహజం. దీనికితోడు పాఠశాలల్లో టీచర్లతో పాటు ఇళ్లల్లో తల్లిదండ్రులు ర్యాంకుల కోసం ఒత్తిడి తీసుకురావడంతో వారు మరింత డిప్రెషన్‌కు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు.. ముఖ్యంగా పది, ఇంటర్ చదువుతున్నవారు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. పలువురు సైక్రియాటిస్టులను సంప్రదిస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి, ఇంటర్ మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
చదవండి: TGCET 2024: ముగిసిన గురుకుల TGCET దరఖాస్తు ప్రక్రియ.. పరీక్ష తేదీ ఇదే..
ఒత్తిడికి గురయిన సందర్భంలో నేర్చుకున్న పాఠాలు మరచిపోతున్నారు.కొందరు అన్నం సరిగా తినడం లేదు. మరికొందరు పాసవుతామా లేదా అనే ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు.
10th Class - 2024 (Study Material, Model Papers) Andhra Pradesh | Telangana
అధిగమించాలిలా...
- గతంలో పది, ఇంటర్, జేఈఈ పరీక్షలు రాసిన సీనియర్ విద్యార్థుల నుంచి వారు ఎలా సన్నద్ధమయ్యారో తెలుసుకుని అందుకు తగ్గ టైం టేబుల్ రూపొందించుకుని ఆచరించాలి.
- చదవకపోతున్నా.. ఇంకేమైన ఆందోళనతో బాధపడుతుంటే వెంటనే తల్లిదండ్రులతో మాట్లాడాలి. అలాగే పిల్లలతో తల్లిదండ్రులు కూడా మాట్లాడాలి.
- నిత్యం మానసిక ప్రశాంతత కోసం యోగా చేయించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
- విద్యార్థి ఒత్తిడికి గరవుతున్నాడని భావిస్తే తల్లిదండ్రులు అతనితో సరదాగా గడపాలి. ఈ సమయంలో పుస్తకాలు పక్కన పెట్టేయించాలి.
- పరీక్షలు ముగిసే వరకు టీవీలు, సెల్‌పోన్లు వాడకానికి స్వస్తి పలకాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు నచ్చజెప్పాలి. ఏది చేసినా పిల్లల సమ్మతితో చేస్తే మానసికంగా వారు అందుకు సంసిద్ధమవుతారు.
- తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. కచ్చితంగా 7–8 గంటల సేపు నిద్రపోవాలి.
Published date : 24 Jan 2024 01:48PM