Technical Certificate Course: పరీక్షల్లో వసూళ్లు!.. పంపకాల్లో తేడా రావడంతో బట్టబయలు
పరీక్ష నిర్వాహకులు అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టైలరింగ్, డ్రాయింగ్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగాయి. అభ్యర్థులతో కలిసి నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పరీక్షల్లో జిల్లా విద్యాశాఖ అధికారుల పేర్లు చెప్పి వసూలు చేపట్టడం గమనార్హం.
పాస్ కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే..
ఇటీవల నిర్వహించిన టైలరింగ్, లోయర్, హయ్య ర్ డ్రాయింగ్ పరీక్షలకు 420 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరికి నగరంలోని కోటగల్లీలో ఉన్న పాఠశాల, ఆదర్శ హిందీ విద్యాలయం, ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. ఒక్కోసెంటర్‌కు ఐదు నుంచి పది చొప్పున ఇన్విజిలేటర్ల కూడా కేటాయించారు. కానీ ఇక్కడే మతలబు ఏర్పడింది.
చదవండి: Free Certificate Courses: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉచిత సర్టిఫికేట్ కోర్సు... ఎక్కడంటే
కోటగల్లిలోని పాఠశాల నిర్వాహకులే అభ్యర్థులతో కుమ్మకై ్క కొందరు అభ్యర్థుల నుంచి రోజుకు రూ. 500 చొప్పున తీసుకొని ఒకరికి బదులు మరొకరి పరీక్షలు రాయించినట్లు తెలిసింది. ఈ పరీక్ష కేంద్రంలో 64 మంది వివిధ విభాగాల్లో పరీక్షలు రాశారు. ఓ మహిళను అడ్డుపెట్టుకొని అభ్యర్థులను ప్రత్యేకంగా సంప్రదించి ఈ వసూళ్లు చేపట్టారు. ఈ పరీక్షలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణలో బాధ్యతలు తీసుకున్న వారు అక్రమాలకు పాల్పడ్డారు.
మరో పరీక్ష సెంటర్‌లో ప్రతిరోజు డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ అభ్యర్థులతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. టైలరింగ్‌లో అభ్యర్థిగా వేరేవారు పాల్గొని థియరీ పరీక్షలు రాసినట్లు తెలిసింది. పరీక్ష జరిగిన మొదటి రోజు నుంచే అభ్యర్థులతో నేరుగా గదిలోకి వెళ్లి అధికారులు రోజుకు ప్రతిఒక్కరూ డబ్బులు ఇస్తే కచ్చితంగా పాసు చేస్తామని ఒకరికి బదులు మరొకరు కూడా రాసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 500 ఇచ్చిన వారికి రాసుకునే వెసులుబాటు, రూ. 1000 ఇచ్చిన వారికి ఒకరికి బదులు ఒకరు రాసుకునే వెసులుబాటు కల్పించినట్లు వారి వసూలు బట్టి తెలుస్తోంది.
చదవండి: Distance Education: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ కోర్సులు
ఇలా వసూలు చేసిన డబ్బులను పరీక్ష నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ ఇందులో కొందరు ఇన్విజిలేటర్లకు డబ్బులు అందకపోవడంతో రెండు రోజుల క్రితం సదరు అధికారిపై డబ్బులు ఇస్తారా లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ వాగ్వాదం జరిగింది. ఇదే త రుణంలో వీరి అక్రమాలు బయటకు వచ్చాయి.
అక్రమార్కులకే అదనపు బాధ్యతలు
అక్రమాలకు పాల్పడే వారికి అదనపు బాధ్యతలు కూడా కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష నిర్వహణ బాధ్యతతో పాటు పాఠశాల బాధ్యతలు కూడా అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరు తమకు అనుకూలమైన సిబ్బందిని నియమించుకొని పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మూడు పరీక్ష కేంద్రాల్లోనూ సుమారు 60 శాతం మంది అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఉన్నత అధికారుల పర్యవేక్షణ, మండల స్థాయి అధికారులు పదో తరగతి పరీక్షల్లో బిజీగా ఉండడంతో ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. దీనినే ఆసరాగా మార్చుకొని సాధారణ నిర్వాహకులు ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి.