RBI: విద్యపై కొంతే..వైద్యంపై అంతంతే
2014–15లో 15.7 శాతంగా ఉన్న ఈ అప్పులు ఏడేళ్లలో 12 శాతం పెరిగినట్టు తెలిపింది. అయితే జీఎస్‌డీపీతో పోలిస్తే అప్పుల విషయంలో అన్ని రాష్ట్రాల జాతీయ సగటు 31.2 శాతం కావడం గమనార్హం. అంటే జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు చాలా తక్కువగా ఉందన్న మాట. దేశంలో తెలంగాణ కంటే నాలుగు రాష్ట్రాలు మాత్రమే తక్కువ అప్పులు తీసుకున్నాయని ఆర్బీఐ చెబుతోంది.
ఐదు శాతం మించని వైద్య ఖర్చు
మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లో ఎంత బడ్జెట్‌ను వైద్య, ఆరోగ్య రంగాల్లో వినియోగిస్తారనే అంశం ఆసక్తిని కలిగిస్తోంది. దేశంలో ఒక్క ఢిల్లీ మాత్రమే ఇందుకోసం బడ్జెట్‌లో 14.4 శాతాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి ఇప్పటివరకు ఏ ఏడాది కూడా వైద్య రంగంపై ఖర్చు 5 శాతం దాటలేదని నివేదిక చెబుతోంది. 2014–15లో 4.1 శాతం వెచి్చంచగా, ఆ తరువాత వరుసగా 3.9, 4.1, 4.2, 4.0, 4.3, 3.4 శాతం ఖర్చు జరిగింది. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో 2.5 శాతం ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వైద్య రంగంపై అతి తక్కువ వెచ్చి స్తున్న రాష్ట్రం తెలంగాణ అని నివేదిక పేర్కొంది.
విద్యలోనూ వెనుకంజ
దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 22.8 శాతం విద్యారంగంపై ఖర్చు చేస్తుండగా, ఆ తర్వాతి స్థానాల్లో అసోం (18.6), బిహార్, చండీగఢ్ (18.1) శాతం ఉండగా, తెలంగాణలో జరుగుతున్న ఖర్చు 5.9 శాతమే. 2014–15లో 11.5 శాతం ఖర్చు పెట్టగా, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. అభివృద్ధి వ్యయాన్ని లెక్కగట్టేందుకు ఆర్బీఐ మూడు సూచికలను పరిగణనలోకి తీసుకుంది. మొదటిది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అభివృద్ధి కోసం చేస్తున్న ఖర్చు, సామాజిక రంగాలపై జరుగుతున్న వ్యయం, మూలధన వ్యయం ఉన్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2019–20లో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగాలపై పెట్టిన ఖర్చు 6 శాతం కాగా, అది 2021–22 నాటికి 8.6 శాతానికి చేరింది. ఈ సూచిక పరంగా చూస్తే తెలంగాణకు 23వ స్థానం వచ్చింది. మూలధన వ్యయం (2.5 శాతం), అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు (15.2)లో మన రాష్ట్రం కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నా మనకంటే చాలా రాష్ట్రాలు ముందున్నాయని ఆర్బీఐ నివేదిక చెపుతోంది. పరిశోధనలపై వెచి్చంచే ఖర్చు తెలంగాణ బడ్జెట్‌లో 0.1 శాతం కూడా మించలేదు. రా>ష్ట్ర ద్రవ్యలోటు ఏడాదిలో ఒక శాతం పెరిగింది. 2019–20లో ద్రవ్యలోటు మొత్తం బడ్జెట్‌లో 0.7శాతం నమోదు కాగా, అది 2020–21లో 1.7 శాతానికి చేరింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 26 శాతం మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లక్ష మందిలో 1,779 మంది కరోనా బారిన పడగా, 10 మంది మృత్యువాత పడ్డారు.
రాష్ట్ర కీలక ఆర్థిక సూచిలివే..
సూచీ |
శాతం |
సొంత రాబడులు |
71.3 |
అభివృద్ధి వ్యయం |
75.4 |
అభివృద్ధియేతర వ్యయం |
20.8 |
వడ్డీ చెల్లింపులు |
10.9 |
అనివార్య ఖర్చులు |
23.8 |
పింఛన్లు |
7.5 |
నగదు బదిలీలు |
13.6 |
(నోట్: మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు లేదా ఖర్చులో సూచీల వారీగా ఆయా శాతాల మేరకు ఖర్చు అవుతోంది.)
చదవండి:
Faculty: బ్యాక్‌లాగ్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు