NCC: విద్యార్థులకు వేరుగా పరీక్షలు
Sakshi Education
ఎన్ సీసీ క్యాడెట్లకు సెమిస్టర్ పరీక్షలను ప్రత్యేక తేదీల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు సూచనలు జారీ చేసింది.
ఈ ప్రత్యేక పరీక్షలకు వచ్చే వారిని మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులుగా పరిగణించరాదని తెలిపింది. ‘ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో రిపబ్లిక్ డే క్యాంప్ కోసం ప్రిపరేషన్ /ట్రైనింగ్ క్యాంపుల్లో క్యాడెట్లు పాల్గొంటున్నారని.. ఫలితంగా వారు సెమిస్టర్ తరగతులకు హాజరు కావడంలో, పరీక్షలు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ సీసీ విభాగం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో సంస్థ ఈ సూచనలు జారీచేసింది. వారికి ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక తేదీల్లో పరీక్షలకు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని యూజీసీ డిసెంబర్ 1న జారీచేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
చదవండి:
MS Dhoni: ఎన్‌సీసీ కమిటీలో సభ్యుడిగా నియమితులైన క్రికెట్ దిగ్గజం?
Published date : 02 Dec 2021 03:21PM