Skip to main content

KVS: 1వ తరగతి ప్రవేశాలు ప్రారంభం..

కేంద్రీయ విద్యాలయ సంగతన్ 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
కేంద్రీయ విద్యాలయలో ప్రవేశాలు ప్రారంభం..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ఫిబ్రవరి 28 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌ https://kvsonlineadmission.kvs.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ మార్చి 21. ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు ఫలితాలు మార్చి 25న విడుదలౌతుంది. సీట్ల ఆధారంగా తదుపరి జాబితాలు ఏప్రిల్ 1, ఏప్రిల్ 8న విడుదలౌతాయి. 1వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్ధులకు మార్చి 31 నాటికి తప్పనిసరిగా 6 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఏప్రిల్ 1వ తేదీన జన్మించినవారు కూడా అర్హులే).

కేవీఎస్‌ 2022 అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28, 2022.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మార్చి 21, 2022.
  • సీటు అలాట్‌ మెంట్‌ తేదీ: మార్చి 25, 2022.
  • సీటు అలాట్‌ మెంట్‌ సెకండ్‌ రౌండ్‌ తేదీ: ఏప్రిల్ 1, 2022.
  • సీటు అలాట్‌ మెంట్‌ థార్డ్‌ రౌండ్‌ తేదీ: ఏప్రిల్ 8, 2022.

చదవండి:

​​​​​​​KNRUHS: ఆన్ లైన్ దరఖాస్తుల ఆహ్వానం

ఇన్ సర్వీస్ అభ్యర్థుల దరఖాస్తుకు అవకాశం

Admissions: గురుకుల పీజీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

IGNOU Admission: ఇగ్నో దరఖాస్తుల గడువు పొడిగింపు

Published date : 28 Feb 2022 05:29PM

Photo Stories