Skip to main content

KNRUHS: ఆన్ లైన్ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్ లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KNRUHS: ఆన్ లైన్ దరఖాస్తుల ఆహ్వానం
ఆన్ లైన్ దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

చదవండి: 

Offline Classes: విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు

NEET: పీజీ పరీక్ష వాయిదా

Covid: విద్యా సంవత్సరం కుదింపు

Published date : 07 Feb 2022 03:27PM

Photo Stories