Kakatiya University: న్యాక్ గ్రేడ్‌పై ఉత్కంఠ
న్యాక్‌కు పంపిన సెల్ఫ్ స్టడీ రిపోర్టులో కొంత తప్పుడు సమాచారం పొందుపర్చారని ఆరోపణలు వస్తుండడం అధ్యాపకుల్లో, ఉద్యోగుల్లో తీవ్ర చర్చగా మారింది. న్యాక్ ఏగ్రేడ్ కలిగిన యూనివర్సిటీ రీ అక్రిడిటేషన్ కోసం అధికారులు 2023 మార్చిలో సెల్ఫ్ స్టడీ రిపోర్టు (ఎస్‌ఎస్‌ఆర్)ను నేషనల్ అసెస్‌మెంటు అక్రిడిటేషన్ కౌన్సిల్‌కు పంపారు. మే 25, 26, 27 తేదీల్లో మూడు రోజులపాటు న్యాక్ టీం చైర్మన్ సుగమ్ ఆనంద్ సహా ఓ మెంబర్, కోఆర్డినేటర్ మరో ఐదుగురు సభ్యుల బృందం క్యాంపస్‌ను సందర్శించి అన్ని అంశాలు పరిశీలించింది. క్యాంపస్‌లో 28 విభాగాలు, ఆరు కళాశాలలు ఉంటే 14 విభాగాలను న్యాక్‌టీం పరిశీలించినట్లు తెలుస్తోంది.
చదవండి: MOU: ‘అస్కీ’.. కేయూ మధ్య అవగాహన ఒప్పందం
పలు విభాగాల్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా న్యాక్ టీం అడిగిన ప్రశ్నలకు అధ్యాపకులు తడబడ్డారని యూనివర్సిటీలో చర్చ జరుగుతుంది. పూర్వ విద్యార్థులతో సమావేశం సందర్భంగా యూనివర్సిటీకి అలుమిని కామన్ రిజిస్ట్రేషన్ ఉందా అని ప్రశ్నిస్తే హాజరైనవారిలో పలువురు తాము పనిచేసిన విభాగాల అలుమిని అసోసియేషన్‌ల గురించి వివరించే యత్నం చేయగా, తాము అడిగింది అది కాదని న్యాక్‌టీం పేర్కొన్నట్లు సమాచారం. యూనివర్సిటీ అభివృద్ధికి పలు సూచనలు సలహాలు ఇవ్వడంలోనూ విఫలమయ్యారని చర్చ జరుగుతోంది. ఇక అధ్యాపకుల సమావేశంలో రెగ్యులర్ అధ్యాపకులు తక్కువమందే హాజరుకావడం, టీచింగ్ స్టాఫ్‌గా ఉన్న డీన్‌లు, బీఓఎస్‌లు, విభాగాల అధిపతులు హాజరుకాకపోవడం.. ఓ పార్ట్‌టైం అధ్యాపకుల సమావేశంలో న్యాక్‌టీం అడిగిన రెండు ప్రశ్నలకు ఓ ప్రొఫెసర్ తప్పుడు సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది.
చదవండి: KU: హాస్టల్ వసతికి విద్యార్థుల ఆందోళన