Skip to main content

KU: హాస్టల్‌ వసతికి విద్యార్థుల ఆందోళన

కాకతీయ యూనివర్సిటీలోని పీజీ సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల (ఎస్‌ఎఫ్‌సీ) విద్యార్థులకు కూడా హాస్టల్‌ వసతి, మెస్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అక్టోబర్‌9న రిజి్రస్టార్‌ చాంబర్‌లో ప్లేట్లు పట్టుకుని ఆందోళనకు దిగారు.
KU
కేయూ రిజిస్ట్రార్‌ చాంబర్‌లో బైఠాయించిన ఏబీవీపీ నేతలు, పీజీఎస్‌ఎఫ్‌సీ కోర్సుల విద్యార్థులు

ఆందోళనపై రిజి్రస్టార్‌ వెంకట్రామ్‌రెడ్డి స్పందిస్తూ ఈ విద్యాసంవత్సరంలో రెగ్యులర్‌ పీజీ కోర్సుల ఫస్టియర్‌ విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాక.. అవకాశం ఉంటే ఎస్‌ఎఫ్‌సీ కోర్సుల విద్యార్థులకు కల్పిస్తామని చెప్పారు.

చదవండి: NSS Award: కాకతీయ వర్సిటీకి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు.. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అయినా విద్యార్థులు శాంతించలేదు. దీంతో రిజిస్ట్రార్‌ వెళ్లి వీసీ రమేశ్‌తో మాట్లాడగా.. ఆయన కూడా హాస్టల్‌ వసతి కుదరదని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో సమస్యను పరిష్కరించలేని రిజిస్ట్రార్‌ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో చివరికి రిజిస్ట్రా ర్‌ వెంకట్రామ్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి లేఖను సంబంధిత సిబ్బందికి అందజేసి వెళ్లిపోయారు. అనంతరం విద్యార్థులు సైతం వెళ్లిపోయారు. రాజీనామాపై రిజి్రస్టార్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించినా అందుబాటులో లేరు. 

Published date : 20 Oct 2022 03:45PM

Photo Stories