JNTUA: జనవరి 6న జేఎన్‌టీయూ స్నాతకోత్సవం
Sakshi Education
అనంతపురం: జనవరి ఆరో తేదీన అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ–ఏ) 13వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీల చాన్సలర్/ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ఆచార్య జింకా రంగజనార్దన డిసెంబర్ 12నతెలిపారు.
స్నాతకోత్సవ నిర్వహణకు వివిధ కమిటీలను నియమించినట్లు వెల్లడించారు. స్నాతకోత్సవ వేళ పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్‌మెడల్స్ అందజేస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకే విద్యార్థులు జేఎన్‌టీయూకు చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Published date : 13 Dec 2023 03:01PM