CSIR: కొండాపూర్‌లో బాలికల ఐటీఐకి అనుమతి
- – రూ.7 కోట్లు ఇచ్చిన హెచ్‌ఏఎల్
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని కొండాపూర్‌లో బాలికల పారి శ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఏర్పాటుకు ప్రభు త్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఏర్పాట్లను వెంటనే ప్రారంభిం చాలని కార్మిక ఉపాధి కల్పన శాఖకు సూచిం చింది. ఈ క్రమంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద రూ. 7 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు గురువారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో హెచ్‌ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ జనార్ధన్ సరకటే, కార్మిక శిక్షణ ఉపాధి కల్పన శాఖ సంచాలకుడు కేవై నాయక్ ఒప్పందం కుదు ర్చుకున్నారు. ఈ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఎల క్ట్రానిక్ మెకానిజం, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా), ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైన్ తదితర కోర్సుల్లో 232 మంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు.